Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ ను అనుకరిస్తూ డ్యాన్స్ చేసిన కేఏ పాల్

  • చిరంజీవితో పోల్చితే పవన్ కు డ్యాన్స్ రాదు
  • నర్సాపురంలో నా విజయాన్ని దమ్ముంటే పవన్, నాగబాబు అడ్డుకోవాలి
  • పవన్, జగన్, చంద్రబాబు సీట్లను అమ్ముకుంటున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డ్యాన్స్ చేయడం రాదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, వేదికపై పవన్ కల్యాణ్ స్టెప్పులు వేశారు. చిరంజీవితో పోల్చితే పవన్ కు డ్యాన్స్ చేయడం రాదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నానని... దమ్ముంటే పవన్ కల్యాణ్, నాగబాబు తన విజయాన్ని అడ్డుకోవాలని సవాల్ విసిరారు. పవన్, జగన్, చంద్రబాబులకు ఓటు వేయరాదని... వారంతా సీట్లను అమ్ముకుని, రాష్ట్రాన్ని దోచుకుంటారని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానని చెప్పారు.
ka paul
jagan
Chandrababu
Pawan Kalyan

More Telugu News